ఇయర్ ఎండ్ స్పెషల్: 'ఇస్మార్ట్' డైరెక్టర్ 2019

Monday,December 30,2019 - 01:46 by Z_CLU

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ కి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. దర్శకులందరికీ ఫ్యాన్స్ ఉంటే పూరికి మాత్రం డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అవును తన ఆటిట్యూడ్, జీవిత సత్యాలతో కూడిన మాటలతో పూరి అందరికీ దగ్గరయ్యాడు. అందుకే అందరి హీరోల అభిమానులు పూరిను గొప్పగా అభిమానిస్తుంటారు.

అయితే ‘టెంపర్’ మినహా కొన్నేళ్లుగా పూరి ఓ హిట్ డెలివరీ చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకో అభిమానులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇవ్వలేకపోయాడు. ఈ ఏడాదైన పూరి ఓ హిట్టు కొట్టాలని అందరూ గట్టిగా కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్టుగానే డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టి ఓ కిక్కాస్ బ్లాక్ బస్టర్ తో ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు పూరి. అదే ఇస్మార్ట్ శంకర్.

అవును.. మొదటి షో నుండే ఇస్మార్ట్ శంకర్ మూవీ వసూళ్ళ సునామి సృష్టించింది. డే బై డే కలెక్షన్స్ తో ఊపందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పెట్టిన బడ్జెట్ కి మూడింతలు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. నిర్మాతలుగా పూరి , చార్మీ కి భారీ లాభాలు తెచ్చిపెట్టి ఈ ఇయర్ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది.

ఇస్మార్ శంకర్ సక్సెస్ అందించిన ఎనర్జీతో ఇప్పుడు ‘ఫైటర్’ సినిమాను రూపొందిస్తున్నాడు పూరి. ఫైటర్ తో న్యూ ఇయర్ లో మరో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ను కంటిన్యూ చేయాలని ఆశిస్తోంది ‘జీ సినిమాలు’.