అప్పుడే బాహుబలిని దాటేసిన కబాలి

Friday,July 22,2016 - 03:15 by Z_CLU

 

భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కబాలి సినిమా. రజనీకాంత్ నటించిన ఈ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అప్పుడే బాహుబలి రికార్డుని అధిగమించింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ లో బాహుబలి సృష్టించిన రికార్డును కబాలి అప్పుడే అధిగమించాడు. ముఖ్యంగా అమెరికాలో బాహుబలిపై కబాలి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బాహుబలి సినిమా ప్రీమియర్ ద్వారా దాదాపు 13లక్షల డాలర్లు ఆర్జిస్తే… ఆ మార్క్ ను కబాలి దాటేశాడు. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు ఏకంగా 14.5లక్షల డాలర్లు వచ్చాయి. కేవలం ప్రీమియర్స్ లోనే కాదు… వీకెండ్ వసూళ్లలో కూడా బాహుబలిని కబాలి అధిగమించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో… వీకెండ్ నాటికి ఈ సినిమా కనీసం 40లక్షల డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండిట్స్ ఊహిస్తున్నారు. ఆ మార్క్ కనుక అందుకుంటే… ఓవర్సీస్ లో బాహుబలి వీకెండ్ వసూళ్లను కబాలి అధిగమించినట్టే.