

Friday,July 22,2016 - 03:28 by Z_CLU
వీవీ వినాయక్ దర్శకత్వంలో తన 150వ సినిమా షూటింగ్ లో చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని చేవెళ్లకు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో రైతులు-చిరంజీవి మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాల్ని తీస్తున్నారు. రైతుల కష్టాలను చిరంజీవి తెలుసుకునే సన్నివేశాలు ఇవి. మరోవైపు ఈ సినిమా టైటిల్ పై సస్పెన్స్ వీడలేదు. కత్తిలాంటోడు అనే టైటిల్ ను ఎంత మాత్రం కొనసాగించరని తెలుస్తోంది. ఈ పేరు స్థానంలో మరో పవర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఖైదీ-150 అనే టైటిల్ పెడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.
Tuesday,June 14,2022 02:45 by Z_CLU
Wednesday,April 27,2022 11:03 by Z_CLU
Wednesday,April 27,2022 10:42 by Z_CLU
Tuesday,April 26,2022 03:46 by Z_CLU