చిరు సరసన రామ్ చరణ్ కథానాయిక ?

Thursday,July 21,2016 - 05:21 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి కొంత కలం గ్యాప్ తరువాత రి ఎంట్రీ ఇస్తున్న 150వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా
చిత్రీకరించిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రాంతం లో చిరు పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్
దర్శకత్వం వహిస్తుండగా , రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ఇప్పటి వరకూ చిరు సరసన కథానాయిక ఫైనల్ అవ్వలేదు. ప్రారంభం లో నయనతార తో పాటు అనుష్క ను కూడా సంప్రదించారు
యూనిట్. డేట్స్ కాళీ లేకపోవడం ఈ సినిమాకు వారు నో చెప్పారని టాక్. ఇప్పుడు మరో కథానాయిక కూడా ఈ లిస్ట్ చేరింది. టాలీవుడ్ టాప్ కథానాయిక కాజల్ ను కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట
యూనిట్. ఇక ఇందుకోసం ఈ ముంబై ముద్దుగుమ్మ 2 కోట్ల పైనే డిమాండ్ చేసిందట. మరీ అంతా అంటూ యూనిట్ మరో నాయిక ను వెతుకుతున్నారని సమాచారం. ఇక ఆగస్టు 22 న చిరు పుట్టిన రోజున ఈ
చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.