మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజైన ‘జువ్వ’ టీజర్

Saturday,January 13,2018 - 02:21 by Z_CLU

గతంలో ‘దిక్కులు రామయ్య’ లాంటి డిఫెరెంట్ సినిమాతో ఎంటర్ టైన్ చేసిన డైరెక్టర్ త్రికోటి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘జువ్వ’ మూవీ. అయితే థ్రిల్లింగ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్,  ఈ రోజు  చిరంజీవి చేతుల మీదుగా  గ్రాండ్ గా రిలీజయింది.

రంజిత్, పాలక్ లల్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది.  కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని ఈ మంత్ ఎండ్ వరకు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న సినిమా యూనిట్, నెక్స్ట్ మంత్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సొమ్మి ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని భరత్ నిర్మిస్తున్నాడు.