నాగార్జున ఇంటర్వ్యూ

Saturday,January 13,2018 - 01:57 by Z_CLU

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది రాజ్ తరుణ్ రంగుల రత్నం. సక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. రాజ్ తరుణ్ ని సరికొత్తగా యూత్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్  చేసుకున్నారు నిర్మాత నాగార్జున.  ఆ విషయాలు మీకోసం…

సంక్రాంతి బొబ్బట్టు….

సినిమా గరించి ఒక్కమాటలో చెప్పాలంటే అన్నపూర్ణ వారి వడ్డించే సంక్రాంతి బొబ్బట్టు ఈ రంగుల రాట్నం. నేను సినిమా చూశాను. బొబ్బట్టు కమ్మగ ఉంటుందీ సినిమా…

 

అవే హైలెట్…

తల్లీ కొడుకు మధ్య ఇమోషన్స్, ప్రేమించిన అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ఇమోషన్స్ ఫ్రెండ్స్ మద్య ఉండే హిలేరియస్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి…

లక్కీగా కుదిరింది…

సినిమా నెల క్రితమే రెడీ అయింది. రైట్ టైమ్ లో రిలీజ్ చేద్దామని చూస్తున్నాము, ఇంతలో సంక్రాతికి థియేటర్స్ దొరకడం, అన్నీ కలిసి రావడం అలా కుదిరేసరికి రిలీజ్ చేస్తున్నాం…

పర్ఫెక్ట్ సినిమా…

మేమైతే బిగినింగ్ నుండి సంక్రాంతికి అనుకోలేదు కానీ సినిమా డెస్టినీ అనుకుంటా… నిజానికి ‘రంగులరాట్నం’ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా… సినిమా చూస్తున్నంత సేపు మనసారా నవ్వుకుంటాం. అప్పుడప్పుడు కంటతడి పెడతాం.  ఇమోషన్స్ అన్నీ కలగలిసిన సినిమా రంగుల రాట్నం.

 

ప్రేక్షకుడిలా చూశా…

ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చూశాను సినిమాని. ఈ స్టోరీ తరవాత ఓ 100 కథలు విని ఉంటా… నాకీ స్టోరీ కనీసం గుర్తు కూడా లేదు. అందుకే సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. మహా అయితే కొన్ని చోట్ల లెంత్ ఎక్కువైంది అనిపించి కట్ చేయించాను, అంతే. అన్నపూర్ణ బ్యానర్ లో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది.

కొత్త యాంగిల్ లో చూస్తాం…

డైరెక్టర్ శ్రీ రంజనికి ఇది ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో ప్రతి ఇమోషన్ ని రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. కథను తనెలా న్యారేట్ చేసిందో గుర్తు లేదు కానీ, స్క్రీన్ పై మాత్రం అద్భుతంగా ప్రెజెంట్ చేసింది.

రాజ్ తరుణ్ గురించి…

రాజ్ తరుణ్ తో గతంలో ఉయ్యాల జంపాల సినిమా చేశాం. నాకు రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. తన యాస కూడా కొత్తగా చాలా బావుంటుంది. సినిమాకి అది చాలా పెద్ద ప్లస్ అయింది.

సితార గారు…

రాజ్ తరుణ్ కి తల్లిగా సితార గారు చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఆవిడే డబ్బింగ్ చెప్పుకోవడం వాళ్ళ ఇమోషన్స్ సరిగ్గా ప్రెజెంట్ అయ్యాయి… ఆవిడ ఎక్స్ ప్రెషన్స్ సినిమాకి పెద్ద ప్లస్…