ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అదే ?

Sunday,June 09,2019 - 03:10 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత చేయబోయే నెక్స్ట్ సినిమాను కన్ఫర్మ్ చేసేసుకున్నాడని తెలుస్తోంది. తారక్ నెక్స్ట్ లిస్టులో ఇప్పటికే కొరటాల శివ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొరటాలతో తారక్ సినిమాకి ఇంకా టైం పడుతుందట. ఈ లోపు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కూడా అయిపోతుంది. అందుకే కొరటాల కంటే ముందు ‘కే.జీ.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు తారక్.

ఇటివలే ప్రశాంత్ నీల్ తో తెలుగులో సినిమా నిర్మించబోతున్నాం అంటూ చెప్పకనే చెప్పేశారు మైత్రి నిర్మాతలు. సో తారక్ , ప్రశాంత్ నీల్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ త్వరలోనే ఎన్టీఆర్ కోసం ఓ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేస్తాడని సమాచారం.