విజయ్ దేవరకొండ సైలెంట్ ...ప్లాన్ ప్రకారమే

Sunday,June 09,2019 - 04:15 by Z_CLU

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమై తక్కువ టైంలోనే సెన్సేషనల్ స్టార్ గా ఎదిగి సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ దేవరకొండ సపోర్ట్ తో ఆ ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ తో హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాకు సంబందించి స్టార్టింగ్ నుండే సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు విజయ్. లేటెస్ట్ గా విడుదలైన ‘దొరసాని’ టీజర్ ని కూడా షేర్ చేయలేదు. దీంతో తమ్ముడి సినిమాకు విజయ్ దూరంగా ఉంటాడా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

నిజానికి విజయ్ ‘దొరసాని’ ఫస్ట్ లుక్ , టీజర్ ను షేర్ చేయకపోవం వెనుక ఓ ప్లాన్ ఉందట. డైరెక్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ్ముడి గురించి అలాగే దొరసాని సినిమా గురించి మాట్లాడతాడని తెలుస్తోంది. అంతే కాదు తమ్ముడి కోసం… ఓ స్టార్ హీరోని గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడట. మరి ఇన్ని రోజులు  తమ్ముడి ఎంట్రీ విషయంలో సైలెంట్ గా ఉండిపోయిన విజయ్ ఆరోజు ఆనంద్ గురించి ఏం చెప్తాడో.. ట్రోల్ చేసిన నెటిజర్లకు ఎలాంటి అన్సర్ ఇస్తాడో..చూడాలి.