నిఖిల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Sunday,June 09,2019 - 01:21 by Z_CLU

‘అర్జున్ సురవరం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు నిఖిల్. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే చందూ మొండేటి డైరెక్షన్ లో ‘కార్తికేయ 2’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నిఖిల్ పుట్టిన రోజున ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు కూడా. ‘కార్తికేయ’ సినిమా నిఖిల్ కి హిట్ తో పాటు ఓ సెపరేట్ ఇమేజ్ తీసుకొచ్చింది. అందుకే చందూ మొండేటితో కలిసి మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడు.

చండూ మొన్దేటి తర్వాత వి.ఐ.ఆనంద్ తో మరో సినిమా ఫైనల్ చేసుకున్నాడట నిఖిల్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమా నిఖిల్ మార్కెట్ ని అమాంతంగా పెంచింది. అందుకే వి.ఐ.ఆనంద్ తో కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నాడు నిఖిల్. తనకి హిట్స్ ఇచ్చి కెరీర్ లో ముందు కెళ్ళడానికి కారణమైన డైరెక్టర్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేసుకుంటూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు ఈ యాంగ్ హీరో. మరి నిఖిల్ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ ఉంటుందో..చూడాలి.