జెర్సీ ట్రయిలర్.. 24 గంటల్లో 4 మిలియన్

Saturday,April 13,2019 - 01:02 by Z_CLU

సరిగ్గా 24 గంటలు గడిచేసరికి జెర్సీ ట్రయిలర్ ప్రభంజనం సృష్టించింది. ఈ ట్రయిలర్ ను ఒక రోజులో ఏకంగా 40 లక్షల మంది చూశారు. ట్రయిలర్ ఆడియన్స్ కు ఎంత కనెక్ట్ అయిందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.

ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కింది జెర్సీ సినిమా. అందుకే ట్రయిలర్ లో కూడా అదే ఎమోషన్ ను చూపించారు. ఆ భావోద్వేగాలు ఆడియన్స్ కు నచ్చాయి. సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. సోమవారం శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ సమ్మర్ కానుకగా 19వ తేదీన థియేటర్లలోకి వస్తోంది జెర్సీ.