ఆన్ స్క్రీన్ ఫెయిల్యూర్ హీరోస్

Saturday,April 13,2019 - 12:03 by Z_CLU

సాధారణంగా హీరో అంటేనే వేరు… ఒంటి చేత్తో కొడితే పది మంది పడిపోవాలి. రేస్ లో వందమందున్నా కెమెరా స్లో మోషన్ లో హీరోనే ఫాలో అవ్వాలి, చివరికి తనే గెలవాలి. ఇది హీరో క్యారెక్టర్ కి బేసిక్ రూల్.  కథ ఏదైనా ఫాలో అవ్వాల్సిన లాజిక్ మాత్రం ఇదే. కానీ సడెన్  గా  ట్రెండ్ మారింది. ‘ఉన్నపళంగా సక్సెస్ అందుకోవడం కాదు… స్ట్రగుల్ తరవాత దక్కేదే రియల్ సక్సెస్’ అనిపిస్తున్నారు మన హీరోలు. అందుకే కాస్త డిఫెరెంట్  గా ఫెయిల్యూర్స్ రోల్స్ లో  నటించి మరింతగా కనెక్ట్ అవుతున్నారు.

మజిలీ : రెగ్యులర్ కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ లేని సినిమా. బ్యాట్ పట్టగానే సిక్సులు.. అన్ లిమిటెడ్ క్రేజ్… చుట్టూరా అమ్మాయిలూ.. లగ్జరియస్ లైఫ్ కాదు.. ఒక ఫెయిల్యూర్ కథ. లవ్ లో, కరియర్ లో… ఆ ఒక్క ఎలిమెంట్ దొరికేవరకు తనలో తానే నలుగుతూ, తనతో తానే యుద్ధం చేసే క్యారెక్టర్…. కన్న కలలన్నీ తారుమారైనా చివరికి లైఫ్ లో నెగ్గి హీరో అనిపించుకున్న ‘పూర్ణ’ కథే మజిలీ.

చిత్రలహరి : ‘ఇలా అయితే కుదరదు… సాయి తేజ్ హిట్ కొట్టడం తప్ప ఆప్షన్ లేదు అన్న టైమ్ లో చేశాడు చిత్రలహరి. సినిమా రిలీజ్ కి ముందు నుండే అటు టీజర్, ఇటు ట్రైలర్ లో కూడా హీరో నొక్కి మరీ చెప్పిన విషయం ‘నా  పేరులో ఉన్న విజయం లైఫ్ లో లేదు’…. రిలీజ్ తరవాత స్క్రీన్ పై మనం చూసింది కూడా అదే. సక్సెస్ కోసం తాపత్రయ పడే ఒక ఫెయిల్యూర్ కథే చిత్రలహరి. చివరికి కలలు కన్న సక్సెస్ ని ఎలా అందుకున్నాడన్నదే క్లైమాక్స్.

జెర్సీ : రిలీజ్ కి ముందే అవుట్ స్టాండింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ‘జెర్సీ’ కూడా ఫెయిల్యూర్ కథే. క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియని ప్లేయర్, ఫెయిల్యూర్ గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు…? తన 36 వ ఏట మళ్ళీ బ్యాట్ పట్టి, నమ్మిన ఆటలోనే తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేదే ‘జెర్సీ’ కథ.  అల్టిమేట్ గా ఇక కుదరదు అని ప్రతి ఒక్కరూ తేల్చి చెప్పినా, నిలబడి లక్ష్యాన్ని  అందుకున్న ఒక ఫెయిల్యూర్ కథే ‘జెర్సీ’.