జీ సినిమాలు ( 14th ఏప్రిల్ )

Saturday,April 13,2019 - 10:02 by Z_CLU

అభినేత్రి

నటీనటులు : ప్రభు దేవాతమన్నాసోను సూద్అమీ జాక్సన్

ఇతర నటీనటులు : సప్తగిరిమురళి శర్మపృథ్వి

మ్యూజిక్ డైరెక్టర్ : సాజిద్ వాజిద్

డైరెక్టర్ :  ఎ.ఎల్.విజయ్

ప్రొడ్యూసర్ :  గణేష్ప్రభుదేవా

రిలీజ్ డేట్ : అక్టోబర్ 7, 2016 

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడుకథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన  సినిమా ‘అభినేత్రి’.

==============================================================================

బ్రాండ్ బాబు
నటీనటులు : సుమంత్ శైలేంద్రఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడమురళీ శర్మరాజా రవీంద్రసత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

=============================================================================

ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్పూజ హెగ్డే
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్రావు రమేష్అభిమన్యు సింగ్పరుచూరి వెంకటేశ్వర రావుసత్యదేవ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ఠాగూర్ మధునల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 24, డిసెంబర్ 2014
మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

బ్రదర్స్
నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : K.V.ఆనంద్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 2012
సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.

==============================================================================

సికిందర్

నటీనటులు : సూర్యసమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్సూరిబ్రహ్మానందంమనోజ్ బాజ్ పాయ్దళిప్ తాహిల్మురళి శర్మఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందిచిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.