సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు వీడియో

Thursday,July 13,2017 - 11:25 by Z_CLU

ప్రస్తుతం స్పైడర్ సెట్స్ పై ఉన్న మహేష్ బాబు బ్రేక్ టైమ్ లో, టీమ్ తో సరదాగా స్పెండ్ చేస్తున్నాడు. అలాంటి ఒక ఇన్సిడెంట్ నే షూట్ చేసి మరీ పోస్ట్ చేశాడు డైరెక్టర్ A.R. మురుగదాస్. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చిన్న సైజు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 

ఇదిలా ఉంటే నిన్నటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, మిగిలిన ఆ ఒక్క సాంగ్ ని చిత్రీకరించడం కోసం యూరోప్ కి బయలుదేరనుంది. ఆగష్టు 2 నుండి బిగిన్ కానున్న ఈ షెడ్యూల్ తో కంప్లీట్ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేయనుంది సినిమా యూనిట్.

మరో వైపు షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేసేసిన స్పైడర్ సినిమా యూనిట్, సెప్టెంబర్ 27 న ఈ సినిమాని రిలీజ్ చేయనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ సినిమాకి A.R. మురుగదాస్ డైరెక్టర్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.