వెయ్యి కోట్ల సినిమా పని ప్రారంభమైంది

Thursday,July 13,2017 - 01:22 by Z_CLU

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘మహాభారతం’ సినిమాలో హాలీవుడ్ పాప్యులర్ యాక్షన్ డైరెక్టర్, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ని కంపోజ్ చేయనున్నాడు. 2020 లో రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడిగా కనిపించనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్, ఈ సినిమాలోని వార్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించడానికి ‘ లీ విటాకర్’ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. గతంలో పాప్యులర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ‘లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్’, ‘ఫాస్ట్ ఫైవ్’ లాంటి అల్టిమేట్ యాక్షన్ బ్లాక్ బస్టర్స్ కి యాక్షన్ కోరియోగ్రఫీ చేసిన ‘లీ’ కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది.

1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని BR శెట్టి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి తక్కిన టెక్నీషియన్స్ తో పాటు స్టార్ కాస్ట్ సెలెక్షన్స్ లో బిజీగా ఉన్న సినిమా యూనిట్ త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.