జాతిరత్నాలు ఫస్ట్ డే కలెక్షన్

Friday,March 12,2021 - 04:38 by Z_CLU

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా థియేటర్లలో నవ్వులు పంచుతోంది. భారీ అంచనాల మధ్య, ఫుల్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓపెన్ అయిన ఈ సినిమా మొదటిరోజు మంచి వసూళ్లు సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ,నైజాంలో ఈ సినిమాను 10 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్మారు. సో.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమాకు మరో 7 కోట్ల రూపాయలు కావాలి. సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్ (షేర్)
నైజాం – రూ. 1.45 కోట్లు
సీడెడ్ – రూ. 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.48 కోట్లు
గుంటూరు – రూ. 0.39 కోట్లు
ఈస్ట్ – రూ. 0.31 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
కృష్ణా – రూ. 0.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు