జాతిరత్నాలు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 15,2021 - 04:15 by Z_CLU

విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్టయింది జాతిరత్నాలు సినిమా. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి సూపర్ హిట్నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్ షాక్ అవుతోంది.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4 రోజుల రన్) పూర్తిచేసుకున్న జాతిరత్నాలు సినిమాకు వరల్డ్ వైడ్ 20 కోట్ల 76 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 17 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే.. ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి.

ఇప్పటికే అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. లాంగ్ రన్ పూర్తయ్యేసరికి కనీసం 40 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.

ఏపీ+నైజాం ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) షేర్
నైజాం – రూ. 7.7 కోట్లు
సీడెడ్ – రూ. 2.2 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.25 కోట్లు
ఈస్ట్ – రూ. 1.1 కోట్లు
వెస్ట్ – రూ. 0.98 కోట్లు
గుంటూరు – రూ. 1.3 కోట్లు
కృష్ణా – రూ. 1.05 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు