ZeeRetro - 50 ఏళ్ల 'రహస్యం'

Friday,March 12,2021 - 03:58 by Z_CLU

జానపదాలకు పెట్టింది పేరు నటసార్వభౌముడు. ఎన్టీఆర్ ఓ జానపదం చేస్తే హిట్ గ్యారెంటీ. అలాంటి టైమ్ లో రిలీజైంది రాజకోట రహస్యం. 1971లో వచ్చిన ఈ సినిమా రిలీజై ఇవాళ్టికి (మార్చి 12) సరిగ్గా 50 ఏళ్లు.

rajakota rahasyam 50 years

అయితే అంతా అనుకుంటున్నట్టు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనికి ఓ కారణం ఉంది. తెలుగులో అప్పుడే కలర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తే జనం పట్టించుకోవడం మానేశారు. కానీ కలర్ ప్రింట్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నిర్మాతపై భారం మోపడం ఇష్టంలేక ఎన్టీఆర్ బ్లాక్ & వైట్ లోనే ఈ సినిమా చేశారు. రాజకోట రహస్యం ఫెయిల్ అవ్వడానికి ఇది ప్రధాన కారణం.

అయితే ఆ తర్వాత నుంచి ఈ సినిమా హిట్టయింది. రీ-రిలీజ్ అయిన ప్రతిసారి కాసుల వర్షం కురిపించింది. అలా 15 ఏళ్ల పాటు రాజకోట రహస్యం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

రాజకోట రహస్యం పేరు చెప్పగానే సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. నెలవంక తొంగి చూసింది అనే పాట ఈ సినిమాలోనిదే. ‘నీవు నాకు రాజా’ అనే సూపర్ హిట్ ఐటెంసాంగ్ కూడా ఇందులోనిదే. విజయా కృష్ణమూర్తి సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

ఎన్టీఆర్-విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నటసార్వభౌముడి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇలా ఫ్లాప్ అయి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయిన సినిమాగా ఈ సినిమాను ప్రత్యేకంగా చెప్పుకుంటారు.