జాహ్నవి కపూర్ – అంచనాలకు భిన్నంగా...

Friday,August 30,2019 - 11:02 by Z_CLU

జాహ్నవి కపూర్ డెబ్యూ సినిమా ‘ధడక్’. ఫస్ట్ సినిమానే అయినా తన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ తో భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఈజీగా కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా కనీసం పాతబడక ముందే నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందో అనే పాయింట్ పై ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడిచాయి. ఈసారి ఫలానా స్టార్ హీరోతో అని, ఫలానా రీమేక్ అని.. రకరకాల ఊహాగానాలు నడిచాయి. అయితే ఈ స్పెక్యులేషన్స్ కి భిన్నంగా ఏకంగా బయోపిక్ లో నటించబోతుంది జాహ్నవి కపూర్.

ఇండియాస్ ఫస్ట్ ఫైటర్ పైలట్ ‘గుంజన్ సక్సేనా’ గా కనిపించబోతుంది. నిజానికి ఇక్కడ బయోపిక్ అనే మాట వాడేకన్నా, జాహ్నవి కపూర్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తుందనే మాట వాడటం కరెక్టేమో… ఎందుకంటే జాహ్నవి సక్సేనా.. కార్గిల్ వార్ లో కీ రోల్ ప్లే చేసింది. ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ పైలట్ లైఫ్ లోని ఈ ఎపిసోడ్ నే  హైలెట్ చేయబోతున్నారు. అందుకే ‘ ద కార్గిల్ గర్ల్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు సినిమాకి.

‘ఆడపిల్ల.. పైలట్ అవ్వకూడదు… అవ్వదు’ అనే పాయింట్ నుండి ఆమె కథ బిగిన్ అయితే సెకండాఫ్ లో ఆమె దేశాన్ని కాపాడాల్సిన సిచ్యువేషన్ లో ఎంత మనోస్థైర్యం తో నిలబడింది…? ఎంత సాహసంతో పోరాడింది..? అనేదే ఈ సినిమా మెయిన్ కంటెంట్…

జాహ్నవి జస్ట్ రెండో సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే… దానికి తోడు ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ చూస్తుంటే… ‘ధడక్’ కి ముందు జాహ్నవికి, తరవాత జాహ్నవిలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందరూ ‘ధడక్’ తరవాత జాహ్నవి కపూర్ సక్సెస్ ఫుల్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకుంటుంది అనుకున్నారంతా… కానీ ఈ స్టార్ కిడ్ మాత్రం అంచనాలకు భిన్నంగా అడుగులు వేస్తుంది.