జై లవకుశ టీజర్ రివ్యూ - ఆ ఒక్క నవ్వు చాలు

Thursday,July 06,2017 - 06:00 by Z_CLU

మంచి ముహూర్తం చూసి మరీ లాంచ్ చేశారు జై లవకుశ టీజర్. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా టీజర్ తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నెగెటివ్ షేడ్స్ లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూపించింది. జై క్యారెక్టర్ లో గొడ్డలి పట్టుకొని, విలనిజం చూపిస్తూ ఎన్టీఆర్ నవ్విన నవ్వు టోటల్ టీజర్ కే హైలెట్.

టెంపర్ లో అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు ఎన్టీఆర్. కానీ జై లవకుశలో ఏకంగా ఓ క్యారెక్టర్ కంప్లీట్ నెగెటివ్ గా సాగుతుంది. ఎన్టీఆర్ విలన్ గెటప్ లో ఎలా ఉంటాడో చూడాలనుకునే ఫ్యాన్స్ కు ఈ టీజర్ తో చిన్న టేస్ట్ చూపించారు. సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు యంగ్ టైగర్. త్వరలోనే మిగతా రెండు పాత్రల టీజర్లను దశలవారీగా విడుదల చేస్తారు. ఈ మూవీకి బాబి దర్శకుడు.

సినిమాకు సంబంధించి త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు. సినిమాను సెప్టెంబర్ 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. జై లవకుశలో నివేత థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో నందిత కనిపించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.