సల్మాన్, షారూక్ బల్లే బల్లే..

Thursday,July 06,2017 - 04:40 by Z_CLU

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, కండలవీరుడుసల్మాన్ ఖాన్ ఎట్టకేలకు కలిశారు. షారూక్ నటిస్తున్న కొత్త సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం వీళ్లిద్దరితో ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ పాట కోసం 3 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు సల్మాన్ ఖాన్.

దశాబ్దానికి పైగా షారూక్, సల్మాన్ కలవలేదు. సల్మాన నటించిన ట్యూబ్ లైట్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేయడం ద్వారా వీళ్లిద్దరూ మళ్లీ కలిశారు. ట్యూబ్ లైట్ లో నటించినందుకు ప్రతిఫలంగా సల్మాన్ కూడా ఇప్పుడు షారూక్ సినిమాలో డాన్స్ చేస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినాకైఫ్ హీరోయిన్.

తాజా సమాచారం ప్రకారం.. ఓ పంజాబీ ఫోక్ బీట్ లో సల్మాన్, షారూక్ కలిసి చిందులేస్తున్నారు. ఈ మూవీలో షారూక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు.