ముచ్చటగా మూడో భామ

Tuesday,March 07,2017 - 12:50 by Z_CLU

మహేష్, కొరటాల సినిమాకి ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ మోస్ట్ ప్యాకప్ చెప్పిన  సినిమా యూనిట్ హీరోయిన్ విషయంలోనే ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. మరోవైపు ఫ్రెష్ నెస్ కోసం ఎవరైనా కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందనే టాక్ కూడా నడుస్తుంది.

గతంలో నేనొక్కడినే సినిమాతో కృతి సానన్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన మహేష్, అతిథి సినిమాతో అమృతా రావును కూడా తెలుగుతెరకు పరిచయం చేశాడు. నిజానికి మురుగదాస్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి సినిమా యూనిట్ ఎంతలా ట్రై చేసినా డేట్స్ వర్కవుట్ కాక లాస్ట్ మూమెంట్ లో రకుల్ ప్రీత్ కి ఫిక్స్ అయింది సినిమా యూనిట్.

కాన్సెప్ట్ డిమాండ్ చేయాలే కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ కాని కొరటాల కూడా హీరోయిన్ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటివరకు కీర్తిసురేష్ పేరు వినిపించినప్పటికీ… తాజాగా మాత్రం కొత్త భామకే ప్రయారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.