ఇట్స్ ఎ బ్రాండ్

Friday,February 03,2017 - 10:03 by Z_CLU

సాధారణంగా హీరోలకు స్టార్ డమ్ ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు కూడా స్టార్ డమ్ తెచ్చుకుంటారు. దర్శకుల్లో కూడా స్టార్స్ ఉన్నారు. కానీ నిర్మాతల్లో స్టార్ డమ్ చూడలేం. ఒక్క దిల్ రాజులో తప్ప. అవును… హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ ఉన్న సూపర్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

nani-dilraju

దిల్ రాజు కేవలం ఓ పేరు మాత్రమే కాదు. ఇట్స్ ఎ బ్రాండ్. ఈ ప్రొడ్యూసర్ బ్యానర్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయిందంటే.. దానికి దిల్ రాజు ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. దిల్ రాజు మార్క్ మూవీ అనే ఇమేజ్.. ఇప్పటికే క్రియేట్ అయిపోయింది. దిల్ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ అయిన బొమ్మరిల్లు వరకు ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా వచ్చిన… శతమానంభవతి సినిమాతో దిల్ రాజు ఇమేజ్ డబుల్ అయింది. ఇక ఈరోజు థియేటర్లలోకి వచ్చిన నేను లోకల్ సినిమాలో కూడా దిల్ రాజు ముద్ర స్పష్టంగా కనిపించింది.

producer-dil-raju-interview-stills-shathamanam-bhavati-movie-7

సినిమా ప్రొడ్యూస్ చేసినా, డిస్ట్రిబ్యూట్ చేసినా అందులో దిల్ రాజు మేజిక్ కనిపిస్తుంది. ఓ సినిమా హిట్ అవుతుందని దిల్ రాజు అంచనా వేస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. రాజుగారి చేయి పడితేచాలు… మూవీ షూర్ హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో ఉంది. అలా డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సూపర్ హిట్ అనిపించుకున్నారు దిల్ రాజు. మరో రెండు నెలల్లో నిర్మాతగా 14 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న దిల్ రాజు… పరిశ్రమకు ఎంతోమంది దర్శకుల్ని పరిచయం చేశారు. తనను నమ్ముకున్న ప్రతి వ్యక్తికి న్యాయం చేశారు. అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడాయన దిల్ రాజు కాదు… బంగార్రాజు.