రాజుగారి గది-2లో సమంత

Friday,February 03,2017 - 11:03 by Z_CLU

లేటెస్ట్ గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో  ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటించిన నాగార్జున ప్రెజెంట్ ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజుగారి గది-2’ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు నాగ్.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో సమంత కూడా ఓ క్యారెక్టర్ లో కనిపించనుంది. ‘జనతా గ్యారేజ్’ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ప్రెజెంట్ ఓ తమిళ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది. తాజాాగా ఇప్పుడు ‘రాజుగారి గది-2’ సినిమాను కూడా కన్ ఫం చేసింది.

samantha-nagarjuna-zee-cinemalu

ఈ సినిమాలో  ఓ ఇంపార్టెంట్   క్యారెక్టర్ ను సమంత చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు ఓంకార్ ఈ విషయాన్ని నాగ్ కి చెప్పాడట. దీంతో స్వయంగా నాగ్, సమంతకు విషయం చెప్పి ఒప్పించాడట. గతంలో నాగార్జున-సమంత కలిసి మనం సినిమాలో నటించారు. ఆ మూవీలో నాగ్ కు అమ్మగా నటించింది సమంత. అయితే అప్పుడాామె అక్కినేని కుటుంబసభ్యురాలు కాదు. కాానీ ఇప్పుడు మాత్రం సమంత, నాగార్జున కోడలు. నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ కూడా అయింది. అలా మామా-కోడలు కలిసి రాజుగారి గది-2 ప్రాజెక్టుకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు.