'ఇష్టం' ఫ‌స్ట్‌లుక్‌ రిలీజ్

Sunday,December 16,2018 - 09:13 by Z_CLU

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల క‌ళా ద‌ర్శ‌కుడు అశోక్.కె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న`ఇష్టం` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏ.కె.మూవీస్ ప‌తాకం పై ఆషా అశోక్ నిర్మిస్తున్న  ఈ సినిమా ఫస్ట్  లుక్ తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజైంది.

రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ (తొలి పరిచయం)హీరో హీరొయిన్ లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది.  ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు అశోక్.కె మాట్లాడుతూ -“చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఇదో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ .. ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే ఆడియో స‌హా, సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కేంద్రుని ఆశీస్సుల‌తో ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది“ అన్నారు.