నాని చేతిలో మూడు సినిమాలు

Sunday,December 16,2018 - 10:04 by Z_CLU

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఇప్పటికే జెర్సీ సినిమాను సెట్స్ పై పెట్టేసిన నాని నెక్స్ట్ విక్రం కుమార్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 19 నుండి షూటింగ్ జరుపుకోనుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఇటివలే ఇంకో సినిమా కూడా ఓకే చేసేసాడు నాని.

దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ సినిమాలో నాని నటించనున్నాడు. ప్రస్తుతానికి నాని ని కన్ఫర్మ్ చేసుకున్న మేకర్స్ మరో యంగ్ హీరోని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు.

సో ‘జెర్సీ’ తర్వాత విక్రం కుమార్ సినిమా ఆ తర్వాత ఇంద్రగంటి సినిమా ప్లాన్ చేసుకుంటున్న నాని ఇంకా కొన్ని కథలు కూడా వింటున్నాడు. సో ఈ మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నేచురల్ స్టార్.