‘వెంకీ మామ’ కి హీరోయిన్ ఫిక్స్ అయింది

Wednesday,December 12,2018 - 01:05 by Z_CLU

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ల మల్టీస్టారర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వీలైనంత త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ప్రాసెస్ లో ఉంది టీమ్. అయితే ఇంతకీ ఈ సినిమాలో వెంకీ, చైతుల సరసన ఫిక్సయిన హీరోయిన్స్ ఎవరు..? ఫిల్మ్ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ, ఇప్పటి వరకు ఈ వరసలో రకుల్ పేరు ఎంత గట్టిగా వినిపిస్తుందో, ఇప్పుడు శ్రియ శరన్ పేరు కూడా చేరిపోయింది.

సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందనే టాక్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. దాంతో ఈ మామా, అల్లుళ్ళ కాంబినేషన్ పై క్రియేట్ అయిన క్రేజ్ డోస్ మరింత పెరిగింది. నిజంగానే ఈ సినిమాలో శ్రియ నటించనుందా..? లేకపోతే ఫిల్మ్ మేకర్స్ మైండ్ లో ఇంకెవరైనా ఉన్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హాట్ టాపిక్ ఇదే. అల్టిమేట్ గా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనుందీ సినిమా. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.