వీకెండ్ రిలీజ్

Wednesday,December 12,2018 - 11:30 by Z_CLU

ఈ వీకెండ్ 4 సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో 3 స్ట్రేట్ తెలుగు సినిమాలైతే ఈ సినిమాలతో పాటు మరో డబ్బింగ్ సినిమా కూడా రిలీజవుతుంది. వాటి వివరాలివే.

భైరవగీత : RGV మార్క్ తో సిద్ధార్థ్ తాతోలు డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ భైరవగీత. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 14 న రిలీజవుతుంది. ఇప్పటికే ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా, రెగ్యులర్ సినిమాలతో కంపేర్ చేస్తే డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ గా ఉండబోతుందన్న బజ్ క్రియేట్ చేస్తుంది. ధనంజయ్, ఇర్రా మోర్  హీరో హీరోయిన్స్.

అనగనగా ఓ ప్రేమకథ : విరాజ్.J. అశ్విన్, రిద్ధి కుమార్ జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. ప్రతాప్ తాతం శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14 న రిలీజవుతుంది. K.L.N. రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్.

హుషారు : ట్రెండీ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా హుషారు. దానికి తోడు సినిమా టైటిల్ కి ‘సెలెబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్’ అనే ట్యాగ్ లైన్   ఫిక్స్ చేయడంతో యూత్ కాన్సంట్రేషన్ ఈ సినిమాపై ఫిక్సయి ఉంది. శ్రీహర్ష డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో ఈ నెల 14 న తెలిసిపోతుంది.

ఒడియన్ : మోహన్ లాల్ నటించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఒడియన్. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దగ్గుబాటి క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ దగ్గుబాటి సంపత్ కుమార్ లు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. V.A. శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాకి డైరెక్టర్.