పుకారుకు చెక్ పెట్టిన మాధవన్

Wednesday,December 12,2018 - 02:48 by Z_CLU

హీరో మాధవన్ పై మొన్నటివరకు ఓ రూమర్ చక్కర్లుకొట్టింది. రవితేజ అప్ కమింగ్ మూవీలో అతడు విలన్ గా కనిపించబోతున్నాడనేది ఆ రూమర్. దీనిపై మాధవన్ స్పందించాడు. తను తెలుగులో ఇప్పటివరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టంచేశాడు.

సవ్యసాచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు మాధవన్. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో విలన్ గా నటించాడు. అందులో మాధవన్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో రవితేజ అప్ కమింగ్ మూవీ కోసం మాధవన్ ను తీసుకున్నారంటూ గాపిప్స్ మొదలయ్యాయి.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో మాధవన్ ను విలన్ గా తీసుకున్నారంటూ టాక్ రావడంతో వెంటనే మాధవన్ రియాక్ట్ అయ్యాడు. తనను యూనిట్ సభ్యులెవరూ కాంటాక్ట్ చేయలేదని స్పష్టం చేసిన ఈ నటుడు, సవ్యసాచి తర్వాత మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు.