పవన్ సినిమా రీమేక్ గా బన్నీ మూవీ..?

Sunday,October 09,2016 - 12:44 by Z_CLU

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథం గతంలో వచ్చిన పవర్ స్టార్ సినిమా ‘తమ్ముడు’ కి రీమేకా…? సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా సినిమా యూనిట్ ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అలాంటిది ఈ కొత్త ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా…?
pawan-effect647x450
పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమాలో మన హీరో పేరు సుబ్రహ్మణ్యం అయితే మనోడు దాన్ని సుభాష్ అని మార్చుకుంటాడు. అలాగే ఈ దువ్వాడ జగన్నాథం కూడా తన పేరు నచ్చక DJ అని పిలిపించుకుంటాడన్న మాట. అలా ఆ తమ్ముడికి, ఈ DJ కి మ్యాచ్ అయిందనేది టాక్. ఇక ఈ దువ్వాడ జగన్నాథంలో కూడా తమ్ముడు సినిమా షేడ్స్ బాగా కనిపిస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ఫ్రెండ్స్ ఎపిసోడ్ కూడా ఉందట. కాకపోతే హరీష్ శంకర్ స్టైల్ లో డిఫరెంట్ గా ఉండబోతున్నాయన్న మాట.