మెగా డబుల్ ధమాకా

Sunday,October 09,2016 - 12:52 by Z_CLU

ఓ వైపు దసరా సంబరాలు, అందులో మెగా మేజిక్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ ఖైదీ 150 ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ ని సృష్టిస్తే, డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న సర్ ప్రైజ్ ఏమిటా అని ఊపిరి బిగపట్టి మరీ ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి కొద్ది గంటల్లో మెగాఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ గా ఖైదీ నంబర్-150 టీజర్ ను విడుదల చేయబోతున్నారు. వీవీ వినాయక్ పుట్టినరోజు తో పాటు దసరా పండగ కూడా కలుపుకొని ఈ టీజర్ ను విడుదల చేస్తున్నారట. జెట్ స్పీడ్ తో షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఖైదీ నం 150 సినిమా యూనిట్ నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని భోగి పండగ రోజున సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.