కొరటాలకు ప్రేమతో...

Sunday,October 09,2016 - 12:37 by Z_CLU

కమర్షియల్ సినిమానా అంటే పూర్తిగా కమర్షియల్ కాదు… అలాగని జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమానా అంటే అదీ కాదు… రెండింటి కాంబినేషన్ ని జనతా గ్యారేజ్ తో సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు కొరటాల శివ. అందుకే జనతా గ్యారేజ్ కి ఆ క్రేజ్. NTR కరియర్ లోనే అతి పెద్ద మైలురాయి లాంటి విజయాలు స్టూడెంట్ నం- 1, ఆది, సింహాద్రి. ఈ జనతా గ్యారేజ్ కూడా ఆ వరసలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన దర్శకుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు తారక్. జనతా గ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ని తన అకౌంట్ లో వేసిన కొరటాల శివకి ఓ పెద్ద ఇంటినే బహుమతిగా గా ఇస్తున్నాడట తారక్.

maheshbabu759

శ్రేమంతుడు సినిమా తరవాత Audi A6 కారును గిఫ్ట్ గా ఇచ్చి మహేష్ బాబు కూడా తన ప్రేమను ఇలాగే చాటుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఏకంగా కోటి 20లక్షల రూపాయల ఖరీదు చేసే ఇంటిని కొరటాలకు గిఫ్ట్ గా ఇస్తున్నాడట. త్వరలోనే ఈ ఇంటి తాళాలు కొరటాల చేతికి రాబోతున్నాయి.