Ugram Teaser ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

Wednesday,February 22,2023 - 12:58 by Z_CLU

అల్లరి నరేష్ Allari Naresh  హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’ కాంబోలో వస్తున్న ‘ఉగ్రం’ Ugram  నుండి  టీజర్ రిలీజైంది. అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ యాక్షన్ గ్లిమ్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంది.

అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గ్లిమ్స్ తో పాటు ఫ్యామిలీ సీన్స్ తో టీజర్ ను పర్ఫెక్ట్ గా కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ‘నాంది’లో సరికొత్తగా కనిపించి మెప్పించిన అల్లరి నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి కొత్తగా కనిపిస్తూ మెస్మరైజ్ చేయబోతున్నాడని టీజర్ చూస్తే తెలుస్తుంది.   టీజర్ లో  “వంటి మీద యూనిఫాం ఉందనే కదా ఈ పొగరు .. ఈరోజు నీదే , నాకు ఓ రోజుస్తుంది” అంటూ విలన్ అనగానే ” నాది కాని రోజు కూడా నేను ఇలాగే నిలబడతా.. అర్థమైందా ” అంటూ నరేష్ చెప్పే  డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చివర్లో నరేష్ మరో లుక్ లో కనిపిస్తూ వచ్చే వర్షం ఫైట్ చూస్తే ‘ఉగ్రం’ రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని అనిపిస్తుంది.

అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేసిన ‘ఉగ్రం’ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ అందుకుంటుంది. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్ సరసన మీర్నా హీరోయిన్ గా నటిస్తుంది. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics