గ్రాండ్ గా లాంచ్ అయిన నారా రోహిత్ ఆటగాళ్ళు

Wednesday,October 11,2017 - 12:36 by Z_CLU

సినిమా సినిమాకి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మ్యాగ్జిమం టైమ్ సినిమా సెట్స్ పైనే ఉండేలా కరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడు నారా రోహిత్. రీసెంట్ గా పరుచూరి మురళి డైరెక్షన్ లో సినిమాకి సంతకం చేసిన నారా రోహిత్ సినిమా ఈ రోజు లాంచ్ అయింది. ఈ సినిమాకి ‘ఆటగాళ్ళు’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సినిమా యూనిట్ ఈ మూవీ ఫస్ట్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసేశారు. ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు జగపతిబాబు కూడా హీరో రోల్ ప్లే చేయడం ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.