చిరు-కొరటాల మూవీ.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్?

Wednesday,July 31,2019 - 01:54 by Z_CLU

త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది చిరంజీవి, కొరటాల శివ సినిమా. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిగా కష్టపడిన కొరటాల.. ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లేతో రెడీగా ఉన్నాడు. ఇప్పుడా స్టోరీలైన్ కాస్త లీక్ అయింది. టాలీవుడ్ లో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందట.

ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో మెగాస్టార్ కనిపించబోతున్నాడట. ఒక పాత్ర పేరు గోవింద్, మరో పాత్ర పేరు ఆచార్య అనే టాక్ నడుస్తోంది. వీటిలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా గోవింద్ పాత్ర ఉంటుందట. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ లో ఆచార్య రోల్ కనిపించనుందట. ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి ఈమధ్య కాస్త స్లిమ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోవింద్ పాత్ర కోసమే చిరు ఇలా మేకోవర్ అయినట్టు టాక్. కొరటాల సినిమాల్లో సోషల్ మెసేజ్ బలంగా ఉంటుంది. చిరంజీవి సినిమాలో కూడా అలాంటి బలమైన సందేశాన్నే చెబుతున్నారట.

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ల పై త్వరలోనే ఈ సినిమా లాంఛ్ కానుంది. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.