డియర్ కామ్రేడ్ బాలీవుడ్ రీమేక్ ఫిక్స్

Wednesday,July 31,2019 - 03:42 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు మిక్స్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్. విడుదలకు ముందే ఈ సినిమా చూసి, హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న కరణ్.. ఇప్పుడు స్క్రీన్ ప్లేకు మార్పులు చేసే పనిలో పడ్డాడు.

బాబి (విజయ్ దేవరకొండ) స్టోరీగా తెరకెక్కింది డియర్ కామ్రేడ్ సినిమా. కానీ ఇందులో లిల్లీ (రష్మిక)ది బలమైన పాత్ర. నిజానికి సెకెండాఫ్ మొత్తం ఈమెదే. లిల్లీ పాత్ర చుట్టూ ఉన్న మీ-టూ కాన్సెప్ట్ కరణ్ ను ఎట్రాక్ట్ చేసింది. అందుకే ఈ సినిమాను ఫిమేల్ సెంట్రిక్ మూవీగా మార్చే పని స్టార్ట్ చేశాడు కరణ్.

అంటే బాలీవుడ్ వెర్షన్ లో బాబి పాత్ర కంటే లిల్లీ పాత్ర పవర్ ఫుల్ గా కనిపిస్తుందన్నమాట. స్క్రిప్ట్ లో మార్పుచేర్పుల కోసం రైటర్స్ టీమ్ ను ఏర్పాటుచేసిన కరణ్… తను అనుకున్న విధంగా స్క్రిప్ట్ రెడీ అయితే సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తాడు.