వీకెండ్ రిలీజెస్

Wednesday,July 31,2019 - 01:27 by Z_CLU

ఈ వీకెండ్ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ కు ఇవి ఏ మేరకు పోటీనిస్తాయో చూడాలి. ఆ మూడు సినిమాల డీటెయిల్స్ ఎక్స్ క్లూజివ్ గా మీకోసం

గుణ 369.. కార్తికేయ హీరోగా నటించిన సినిమా. నిజానికి హిప్పీ తర్వాత వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉండడానికి వీల్లేదు. కానీ బలమైన కథ, అద్భుతమైన కథనం, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా వస్తుందనే బజ్ బలంగా ఉంది. అందుకే గత మూవీతో సంబంధం లేకుండా గుణ369పై అంచనాలు పెరిగాయి. బెల్లంకొండ శిష్యుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అనఘ హీరోయిన్ గా పరిచయమౌతోంది.

రాక్షసుడు.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన థ్రిల్లర్ మూవీ. తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

గుణ, రాక్షసుడితో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా శివరంజని. రష్మి, నందు, అఖిల్ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సస్పెన్స్-హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. నాగప్రభాకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు.