వచ్చేనెలలో ఇంకొక్కడు వస్తున్నాడు...

Tuesday,August 30,2016 - 02:36 by Z_CLU

 

రెండు విలక్షణమైన పాత్రల్లో విక్రమ్ నటించిన సినిమా ఇంకొక్కడు. తమిళ్ లో ఇరుముగమ్ పేరిట తెరకెక్కిన ఈ సినిమాను ఇంకొక్కడు పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. సినిమాలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ క్యారెక్టర్ లో, రెండు విలక్షణమైన పాత్రల్లో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. సైన్స్ థ్రిల్లర్ కథాశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొన్నేళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విక్రమ్… ఇంకొక్కడు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అతడి తాజా చిత్రం ‘ఐ’ ఫ్లాప్ అయింది.