మామ హీరోగా... అల్లుడు నిర్మాతగా.. 

Tuesday,August 30,2016 - 02:31 by Z_CLU

కబాలి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీ అవుతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్ ను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్. మామ సినిమా కోసం ఏకంగా ఓ బ్యానర్ పెట్టి ఆ ప్రొడక్షన్ హౌజ్ పై సూపర్ స్టార్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. నిజానికి కబాలి మిక్స్ డ్ టాక్ తర్వాత రంజిత్ కు మళ్లీ అవకాశం వస్తుందని ఎవరూ అనుకోలేదు. చివరికి హీరో సూర్య కూడా మొదట ఓకే చెప్పి తర్వాత రంజిత్ ను పక్కనపెట్టాడు. ఇలాంటి టైమ్ లో రజనీకాంత్ మరోసారి అవకాశం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారి రజనీకాంత్ కోసం మరో డిఫరెంట్ స్టోరీ పికప్ చేశాడు రంజిత్. స్టోరీలైన్ బాగా నచ్చడంతో.. వెంటనే రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సూపర్ స్టార్ ఒప్పుకున్నారు. రోబో 2.0 కంప్లీట్ అయిన వెంటనే రజనీ-రంజిత్ కాంబోలో సినిమా సెట్స్ పైకి వస్తుంది.