అత్యంత కీలకమైన పని పూర్తి చేసిన రాజమౌళి

Tuesday,August 30,2016 - 04:06 by Z_CLU

 

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారు యూనిట్.
దాదాపు  పది వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ తో  పాటు కొన్ని కీలక సన్నివేశాలను  చిత్రీకరించారు.
ఇక ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లతో ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కు దక్కిన గౌరవం తో అదే తరహా లో పార్ట్ -2 ను సిద్ధంచేస్తున్నాడు జక్కన్న. ఇక తదుపరి షెడ్యూల్ కి కాస్త గ్యాప్ ఉండడం తో గ్రాఫిక్స్ వర్క్ పై దృష్టి పెట్టనున్నాడట రాజమౌళి.