సినిమా వాయిదా... మంచే జరిగింది!

Monday,May 25,2020 - 01:31 by Z_CLU

నాని , సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘V’ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ వరకు వచ్చి వాయిదా పడింది. సరిగా లాక్ డౌన్ కి ముందు సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే అలా వాయిదా వేసుకోవడమే మంచిదైందని చెప్తున్నారు దర్శకుడు ఇంద్రగంటి. లాక్ డౌన్ కి ముందు సినిమా రిలీజై ఉంటే టాక్ బాగున్నా థియేటర్స్ మూతపడటం వల్ల సినిమా కిల్ అయ్యుండేదని అన్నారు.

నాని-తన కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై తమ నమ్మకం గట్టిగా ఉందని కచ్చితంగా థియేటర్స్ లో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు ఇంద్రగంటి. అంతేకాదు.. ఈ లాక్ డౌన్ టైమ్ లో మూడు కథలు సిద్దం చేస్తున్నాని చెప్పుకున్నారు.

ఇక ఇంద్రగంటి చెప్పినట్టు సినిమా లాక్ డౌన్ కి ముందు గానీ థియేటర్స్ లోకి వచ్చుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. సో ‘V’ వాయిదా పడటం మంచిదే అయింది.