పెళ్లి వద్దంటూ సందడి చేసిన సాయితేజ్

Monday,May 25,2020 - 02:13 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్, రానా కూడా సంద‌డి చేయ‌డం విశేషం.

సాంగ్ విడుద‌ల చేసిన త‌ర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ సాంగ్‌ను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. పెళ్లి చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ,చేసుకోవ‌డం మాత్రం ప‌క్కా’’ అని నితిన్ తెలిపారు.

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాడాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా