బాలయ్య నెక్స్ట్ ఏంటి?

Monday,May 25,2020 - 01:25 by Z_CLU

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా సెట్స్ పై ఉండగానే బాలయ్య నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే డిస్కషన్ మొదలైంది. మొన్నటివరకు బాలయ్య, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తో నెక్స్ట్ ఓ యాక్షన్ సినిమా చేస్తాడనే రూమర్ చక్కర్లు కొట్టగా ఇప్పుడు ఆ సినిమా ప్లేస్ లో మళ్ళీ పూరి పేరు వినిపిస్తోంది.

పైసా వసూల్ సమయంలోనే తమ కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ చెప్పుకున్నారు బాలయ్య, పూరి. అందుకే ఇప్పుడీ కాంబో సినిమా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలయ్య సినిమాకు పూరి కథ సిద్దం చేస్తున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

మరో వైపు బాలయ్య , బి.గోపాల్ కాంబో సినిమా కూడా అనౌన్స్ మెంట్ కి దగ్గరిలో ఉందని అంటున్నారు. మరి వీరిద్దరిలో బాలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనేది తెలియాలంటే అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.