ఎన్టీఆర్ బయోపిక్ లో నేను లేను

Tuesday,February 20,2018 - 12:10 by Z_CLU

తేజ, బాలకృష్ణ కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుందంటూ మొన్నటివరకు వార్తలొచ్చాయి. దీనిపై తేజ కాంపౌండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాకపోతే ఛాలెంజింగ్ రోల్స్ చేసే నిత్యామీనన్ ఇందులో ఉందని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ ప్రాజెక్టులో తను లేనని నిత్యామీనన్ స్పష్టంచేసింది.

“ప్రస్తుతానికి తెలుగులో కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ క్యారెక్టర్ కోసం నన్ను సంప్రదించారు. కానీ ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. అందులో నేను నటించడం లేదు.” ఇలా ప్రాజెక్టుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది నిత్యామీనన్. కాకపోతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. “అ!” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వివరాలు వెల్లడించింది.

ప్రస్తుతం వెంకటేష్ తో చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టాడు దర్శకుడు తేజ. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అది ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రీసెర్చ్ వర్క్ నడుస్తోంది.