సెట్స్ పైకి వచ్చిన సమంతా ‘U టర్న్’

Tuesday,February 20,2018 - 10:03 by Z_CLU

కన్నడలో సూపర్ హిట్టయిన ‘U టర్న్’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతుంది. ఒక ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన యువకుడి హత్య, దాని వెనకాల ఉన్న మిస్టరీ ప్రధాన కథాంశం గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. శనివారం నుండి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసిన ఈ సినిమాలో సమంతా లీడ్ రోల్ ప్లే చేస్తుంది.

 

ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లా కనిపించనున్నాడు. రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ‘U టర్న్’,  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పవన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ‘రంగస్థలం’  టీజర్ లో డిఫెరెంట్  లుక్ తో  టాలీవుడ్ లో  సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంతా, మహానటి సినిమాలో జర్నలిస్ట్  గా కనిపించనుంది. బ్యాక్ టు బ్యాక్   పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంతా ‘U టర్న్’ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.