Hot Topic : Nani doing a special role in SSMB28 ?

Friday,May 20,2022 - 12:44 by Z_CLU

Hot Topic : Nani doing a special role in SSMB28 ?

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' తో థియేటర్స్ లో సందడి చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో నాని ఓ స్పెషల్ కేరెక్టర్ చేయనున్నాడని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

నిజానికి సినిమాలో సెకండ్ మెయిన్ రోల్ ఒకటి ఉందట. దాన్ని నాని తో చేయిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడని టాక్. ఇటివలే నాని కి స్టోరీ నెరేషన్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ న్యూస్ లో నిజమెంత అనేది పక్కన పెడితే  మహేష్ సినిమాలో నాని అంటూ #SSMB28 సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

మేకర్స్ కూడా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సినిమాలో రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 2023 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

 * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics