హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న హిట్ పెయిర్

Friday,July 14,2017 - 12:18 by Z_CLU

ఇప్పటికే వరుసగా రెండు హిట్స్ అందుకున్నారు. హిట్ పెయిర్ గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇంకొక్క హిట్ కూడా తగిల్తే హిట్ పెయిర్ గా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ప్రస్తుతం అదే పని మీద ఉన్నారు నాని-నివేత. ముచ్చటగా మూడోసారి కలిసి నటించేందుకు ప్రిపేర్ అవుతున్నారు.

జెంటిల్ మేన్ సినిమాతో కలిసిన ఈ జంట.. తాజాగా నిన్నుకోరి మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో నటిగా నివేత మరోసారి అందరి దృష్టిలో పడింది. నివేత టాలెంట్ చూసిన నాని తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఈ సినిమాలో నివేతను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

మేర్లపాక గాంధీ-నాని సినిమాను మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఎంసీఏ మూవీ చేస్తున్నాడు నాని. అది కంప్లీట్ అయిన వెంటనే గాంధీ సినిమా ఉంటుంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే హీరోయిన్ పై క్లారిటీ వస్తుంది.