తనికెళ్ళ భరణి బర్త్ డే స్పెషల్

Friday,July 14,2017 - 01:04 by Z_CLU

టాలీవుడ్ లో మల్టీ టాలెంటడ్ పర్సనాలిటీ తనికెళ్ళ భరణి ఈ రోజు 63 వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 800 సినిమాల్లో నటించిన భరణి.. కరియర్ లో 3 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

తెలుగులో ‘లేడీస్ టైలర్’ సినిమాతో నటుడిగా ఇంట్రడ్యూస్ అయిన తనికెళ్ళ భరణి నిజానికి ఈ సినిమా కన్నా ముందే చాలా సినిమాలకు డైలాగ్స్ రాశారు. 1984 లో రిలీజైన ‘కంచు కవచం’ సినిమాతో మొదలుపెడితే లేడీస్ టైలర్, స్వర కల్పన, శివ, శీను వాసంతి లక్ష్మి.. ఇలా ఎన్నో సినిమాలకు డైలాగ్స్ రాయడం తో పాటు ‘గుండమ్మగారి మనవడు’ సినిమాలో ‘భలే భలేటి మందు’ పాటను కూడా పాడారు. ‘మిథునం’  సినిమాకి దర్శకత్వం వహించి క్రిటిక్స్ నుండి సైతం ప్రశంసలు అందుకున్నారు.

రచయిత, దర్శకుడు, గీత రచయిత, డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్.. ఇలా తణికెళ్ల భరణిలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. వీటిని మించి భరణి గారిలో ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త కూడా ఉన్నాడు. ఇలాంటి క్వాలిటీస్ టాలీవుడ్ లో అతికొద్ది మందిలో మాత్రమే కనిపిస్తాయి. తణికెళ్ల భరణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.