50 రోజులు పూర్తి చేసుకున్న 'రారండోయ్..' మూవీ

Friday,July 14,2017 - 11:30 by Z_CLU

నాగచైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’  రిలీజై ఇవాల్టికి సరిగ్గా 50 రోజులు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అటు క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించడంలో సక్సెస్ అయి నాగ చైతన్య కరియర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ లా నిలిచింది. ఈ ఏడాది సమ్మర్ సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది రారండోయ్ వేడుక చూద్దాం.

సినిమా రిలీజ్ కి ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన ‘రారండోయ్’ రిలీజ్ తరవాత థియేటర్స్ లో టైటిల్ కి తగ్గట్టు సెలెబ్రేషన్స్ ని పట్టుకొచ్చేసింది. నాగచైతన్య, రకుల్ మెస్మరైజింగ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఎంటర్ టైనింగ్  స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్టు దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమా సక్సెస్ కి కావాల్సినంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ 50 రోజుల్లో ఈ సినిమాకు 52 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 30కోట్లకు పైగా షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా చైతూకు ఓ మంచి బేస్ క్రియేట్ చేసింది ఈ మూవీ.