బన్ని DJ లో హైలెట్ కానున్న సాంగ్

Wednesday,March 29,2017 - 07:21 by Z_CLU

బన్ని, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే డెఫ్ఫినేట్ గా సమ్ థింగ్ స్పెషల్ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన టీజర్, అందులో బన్ని గెటప్ అండ్ డైలాగ్స్ తో… ఎక్స్ పెక్టేషన్స్ కి మించిన ఎంటర్ టైనర్ అని క్లియర్ గా క్లారిటీ కూడా వచ్చేసింది.

ఆర్య, పరుగు లాంటి బ్లాక్ బస్టర్స్ తరవాత అల్లు అర్జున్ దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో  సినిమా ఇది. దానికి తోడు  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే DJ సినిమా విషయంలో క్రియేట్ అవుతున్న హైప్ కి బోలెడు రీజన్స్ దొరుకుతాయి.

రీసెంట్ గా అబూదాబి లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, రేపో మాపో మరో సాంగ్ తో సెట్స్ పైకి రానుంది. సినిమాలోని హైలెట్స్ లో మేజర్ హైలెట్ గా ఎట్రాక్ట్ చేయనున్న ఈ సాంగ్ కి దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.