జీ సినిమాలు ( మార్చి 30th )

Wednesday,March 29,2017 - 10:06 by Z_CLU

నటీనటులు : కాంతా రావు, రాజశ్రీ, శోభన్ బాబు

మ్యూజిక్ డైరెక్టర్ : మాస్టర్ వేణు

డైరెక్టర్ : C.S. రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్

==============================================================================

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

నటీ నటులు : కమల హాసన్, విజయశాంతి

ఇతర నటీనటులు : శ్రీ విద్య, నగేష్, చరణ్ రాజ్, జయలలిత, P.L.నారాయణ, గొల్లపూడి మారుతి రావు, E.V.V. సత్యనారాయణ.

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1989

విలక్షణ నటుడు కమల హాసన్ కరియర్ లో ఇంద్రుడు చంద్రుడు సినిమాది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ యువకుడిగా, కరప్టెడ్ మేయర్ గా కమల హాసన్ నటించిన తీరు సినిమాకే హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు. ఇళయరాజా సంగీతం సినిమాకి మరో ఎసెట్.

=============================================================================

నటీనటులు : జ్యోతిక, పృథ్విరాజ్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, స్వర్ణమాల, వత్సల రాజగోపాల్, బ్రహ్మానందం, M.S. భాస్కర్, శ్రీరంజిని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : రాధా మోహన్

ప్రొడ్యూసర్ : ప్రకాష్ రాజ్

రిలీజ్ డేట్ : 23 ఫిబ్రవరి 2007

జ్యోతిక, పృథ్వీరాజ్ జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మాటరాని మౌనమిది.  రాధా మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డెఫ్ & డంబ్ అమ్మాయిగా జ్యోతిక పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

============================================================================

నటీనటులు  – ఉదయనిధి స్టాలిన్, హన్సిక

ఇతర నటీనటులు – శరణ్య, సంతానం

మ్యూజిక్ డైరెక్టర్  – హరీష్ జైరాజ్

డైరెక్టర్  – ఎమ్.రాజేష్

రిలీజ్ డేట్  – 2012, ఆగస్ట్ 31

తమిళనాట భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా మారి చేసిన మొట్టమొదటి చిత్రం ఓకే ఓకే. బాగా డబ్బు ఉంది. తలచుకుంటే ఎలాంటి డైరక్టర్ ను అయినా ఒప్పించి ఓ మాస్ మసాలా భారీ బడ్జెట్ సినిమా చేయగలడు ఉదయ్ నిధి స్టాలిన్. కానీ కథపై నమ్మకంతో.. తనే నిర్మాతగా ఉంటూ, హీరోగా మారి ఓ కామెడీ రొమాంటిక్ సినిమాతో అరంగేట్రం చేశాడు. ఉదయ్ నిధి స్టాలిన్ నమ్మకం వమ్ముపోలేదు. ఓకే ఓకే సినిమా తమిళనాట బ్రహ్మాండంగా ఆడింది. 2012 సూపర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. హన్సిక అందాలు ఈ సినిమాకు ఒక ఎత్తయితే… ఉదయ్-సంతానం కలిసి పండించిన కామెడీ సినిమాకు బ్యాక్ బోన్. అటు హరీష్ జైరాజ్ కూడా తన సంగీతంతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు.

=============================================================================

నటీనటులు : సిబిరాజ్, నీల

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆహుతి, విజయ్ సేతుపతి, విద్యార్ధి, పాండి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : ప్రభు సాల్మన్

ప్రొడ్యూసర్ : సత్య రాజ్

సిబిరాజ్, లీల హీరో హీరోయిన్స్ గా నటించిన అల్టిమేట్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ లీ. సత్యరాజ్ నిర్మించిన ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు.